CBN ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్.. 5 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్

53చూసినవారు
CBN ప్రమాణ స్వీకారం ఎఫెక్ట్.. 5 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్
కేసరపల్లి వేదికగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు కూటమి నేతలు, కార్యకర్తలు కేసరపల్లికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో
5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్