భారత్‌లో 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఈ క్రీడలకు హైదరాబాద్‌ను వేదిక చేయాలని కేంద్రాన్ని కోరామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు.