తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై EC బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారులు గురువారం సాయంత్రం ఎమ్మెల్సీల ఎన్నికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో.. వారి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు వెల్లడించింది.