TG: సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్షాలు కోరుకున్నప్పుడు ఎన్నికలు జరగవన్నారు. ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షం తమ ప్రభుత్వాన్ని బద్నం చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాగితపు బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కాగ్ మందలించినా బీఆర్ఎస్ ప్రభుత్వం మారలేదన్నారు. తాము చేసిందే చెబుతామని స్పష్టం చేశారు.