ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో 20-25 ఏళ్ల మధ్య వయసున్న మగ ఏనుగు మృతి చెందింది. ఈ ఏనుగును వరుసగా మూడు రోజుల పాటు పులి వెంబడించినట్లు పార్క్ అధికారులు తెలిపారు. పులి సుదీర్ఘంగా వెంబడించడం వల్ల అలసట గురై ఏనుగు చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏనుగు చనిపోయే ముందు రాత్రి సమయంలో పులి వెంబడించిన వీడియోను అధికారులు విడుదల చేశారు.