ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలో ఆదివారం మావోయిస్టులు ముగ్గురిని హత్య చేశారు. గంగులూరు పరిధిలో ముకేశ్ హేమ్లాను హత్య చేసిన మావోలు.. కోరాచోలిలో ప్రజా కోర్టు నిర్వహించి ఇద్దరిని ఉరి తీశారు. ఈ మేరకు పోలీస్ ఇన్‌ఫార్మర్లను హత్య చేసినట్లు మావోలు కరపత్రాలు వదిలి వెళ్లారు. హత్యకు తామే కారణమని గంగులూరు ఏరియా కమిటీ ప్రకటించింది.