పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అటవీ ప్రాంత సమీపంలోని ఓ గ్రామంలోకి ఇటీవల కొన్ని ఏనుగులు చొరబడ్డాయి. దీంతో గ్రామస్థులు వాటిని తరిమికొట్టేందుకు ఇనుప కడ్డీలకు మంట పెట్టి ఏనుగులపై విసిరారు. దీంతో ఆ ఇనుప రాడ్డు ఓ పెద్ద ఏనుగుకు గుచ్చుకుంది. మంట దాటికి ఆ ఏనుగు విలవిల్లాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వగా, అటవీ శాఖ అధికారులు సీరియస్ అయ్యారు.