హైదరాబాద్లో ఎంపాక్స్ నోడల్ కేంద్రాలుగా గాంధీ ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గాంధీలో 14 పడకలు, ఫీవర్ ఆసుపత్రిలో 6 పడకలతో వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపాక్స్ బాధితులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఈ వార్డుల్లో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని తెలిపారు