TG: ఖమ్మం నగరంలోని బుధవారం విషాద ఘటన జరిగింది. అక్కడి కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యనే అంటూ ఆరోపిస్తూ తోటి ఉద్యోగులు శాంతియుత ర్యాలీ చేపట్టారు.