మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన పాలనాకాలంలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం ఆయన తపన పడేవారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అలాగే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.