గ్రామంలో అంతు చిక్కని వ్యాధి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

1082చూసినవారు
గ్రామంలో అంతు చిక్కని వ్యాధి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఏపీలోని అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పెదబరడలో అంతు చిక్కని వ్యాధి ప్రజలను బెంబేలిత్తిస్తోంది. ఈ వ్యాధితో వారం రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో వాంతులు, విరేచనాలు, కళ్లు తిరిగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ఏంటో వైద్యులు సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ప్రజలు చెబుతున్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్