అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ

70చూసినవారు
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ
ఇంగ్లాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మొయిన్ అలీ ఇంగ్లాండ్ తరఫున 2014లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 6,600కిపైగా పరుగులు చేశాడు. 8 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు చేయడంతో పాటు 366 వికెట్లు పడగొట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్