24 గంటల్లో ఏడాదికి సరిపడా వర్షపాతం.. ఎక్కడంటే?

77చూసినవారు
24 గంటల్లో ఏడాదికి సరిపడా వర్షపాతం.. ఎక్కడంటే?
చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హెనాన్ ప్రావిన్సులోని డఫెంగ్యింగ్ అనే చిన్న పట్టణంలో మంగళవారం ఒక్కరోజులో దాదాపు ఒక ఏడాదిలో కురిసే వర్షం కురిసింది. 24 గంటల్లోనే ఏకంగా 606.7 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో టౌన్ అంతా నీట మునిగిపోవటంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో వణికిపోతున్నారు. హెనాన్, షాండాంగ్, అన్హూయ్ ప్రావిన్సుల్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయని చైనా జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్