తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాల దగ్ధం కేసులో కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. సీనియర్ అసిస్టెంట్లు కే.నూకరాజు, కారంబేబీ, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్‌ను ఆమె సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఏ.కుమారి, ఏ.సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.