వివిధ దేశాల్లో పుట్టి తమ దేశంలో నివసిస్తున్న పౌరులను స్వదేశాలకు పంపేందుకు స్వీడన్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. వలసదారులు స్వచ్ఛందంగా తమ దేశాన్ని వీడితే 10వేల స్వీడన్ క్రౌన్స్(రూ.80వేలు), చిన్నారులకు ఈ మొత్తంలో సగంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం దేశంలో 20 లక్షలకు పైగా వలసదారులున్నారు. దీంతో వలసదారుల నియంత్రణకు స్వీడన్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.