బాలికను అసభ్యకరమైన వీడియో చూడమని బలవంతం చేసిన టీచర్.. పాఠశాలను తగలబెట్టిన అస్సాం ప్రజలు

77చూసినవారు
బాలికను అసభ్యకరమైన వీడియో చూడమని బలవంతం చేసిన టీచర్.. పాఠశాలను తగలబెట్టిన అస్సాం ప్రజలు
అసోంలోని కరీంగంజ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాటశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని అసభ్యకరమైన వీడియో చూడమని బలవంతం చేశాడు. దీంతో బాలిక ఉపాధ్యాయుడు తనను ఏదో అసభ్యంగా చూడమని బలవంతం చేశాడని, తనను అనుచితంగా తాకాడని ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలను తగలబెట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్