జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న సైనికులకు రక్షా బంధన్ సందర్భంగా కాశ్మీరీ అమ్మాయిలు 200 కంటే ఎక్కువ రాఖీలను తమ చేతులతో నేసినారు. వారు పూసలు, దారాలతో రాఖీలు నేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సైనికులు మన దేశాన్ని కాపాడుతున్నారని ఇక్రా మున్నర్ అనే యువతి పేర్కొంది. రాఖీ ట్రైనర్ వసీం పఠాన్ మాట్లాడుతూ.. తమ అక్కాచెల్లెళ్లకు దూరమయ్యారనే భావన జవాన్లకు కలగకూడదనే రాఖీలు కట్టేందుకే ఇలా చేస్తున్నామని చెప్పారు.