ఆలయంలోకి ప్రవేశించిన ఓ దొంగ వెండి విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. యూపీలోని సహరన్‌పూర్ లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శనిదేవ్ ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఈ క్రమంలో ఆ దొంగ ఎవరైనా చూస్తారేమోననే భయంతో అటూఇటూ చూస్తూ తనతో తెచ్చుకున్న సంచిని బయటికి తీశాడు. ఈ క్రమంలోనే అతడి కన్ను శివలింగంపై ప్రతిష్టించిన వెండి పాముపై పడింది. వెంటనే దానిని తీసి సంచిలో వేసుకొని పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది.