మనం కొత్త సిమ్ కార్డు తీసుకున్నా కొన్నిసార్లు స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. దానికి గల కారణం.. టెలికాం సంస్థలు రీసైకిల్డ్ నంబర్లు ఇవ్వడమే. అలా మీకు రీసైకిల్డ్ నంబర్ వస్తే మాత్రం స్పామ్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. గతంలో వేరొకరు ఉపయోగించి ప్రస్తుతం వాడుకలో లేని నంబర్లను టెలికాం కంపెనీలు మరొకరికి ఇస్తాయి. ఇలా నెలకు కోటి పైగా రీసైకిల్డ్ నంబర్లను విడుదల చేస్తాయి. నంబర్ల కేటాయింపులో సర్వీస్ ప్రొవైడర్లకు పరిమితులు ఉన్నందున ఇలా చేస్తాయి.