ధర పెరిగినా గిరాకీ తగ్గని పసిడి

75చూసినవారు
ధర పెరిగినా గిరాకీ తగ్గని పసిడి
పసిడి ధర జీవనకాల గరిష్టాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి- మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. 2023 ఇదే త్రైమాసిక గిరాకీ 126.3 టన్నులతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. బంగారం కొనుగోళ్ల విషయంలో RBI దూకుడు కూడా ఇందుకు కలిసొచ్చింది. సమీక్షా త్రైమాసికంలో 19 టన్నుల బంగారాన్ని RBI కొనుగోలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్