అమెరికాకు చెందిన థామస్ టీజే హూకర్‌కు డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండె ఆగిపోయింది. కెంటకీలోని ఓ ఆసుపత్రి వైద్యులు పరిశీలించి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆపరేషన్ థియేటర్‌లోకి బాడీని తీసుకెళ్తున్న క్రమంలో బాధితుడిలో కదలికలు కనిపించాయి. అతడి కళ్ల నుంచి నీరు కారడం, చేతులను తడుముతున్నట్లు గమనించిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వైద్యులు అవయవదానాన్ని నిలిపివేశారు.