ఓయూ ప‌రిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

51చూసినవారు
ఓయూ ప‌రిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. MBA (CBCS), MBA (టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌), MBA (టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌) తదితర కోర్సుల 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ఈ నెల 21 నుంచి జరుగుతాయి. MDHM మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు ఈ నెల 24 నుంచి, MBA (ఈవినింగ్‌) 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వెబ్‌సైట్‌ www.osmania.ac.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్