ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టాయి. ‘ఇసుక రీచ్‌ల లీజు హద్దులు దాటేసి మరీ ఆ సంస్థలు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారు’ అని ఏసీబీ గుర్తించింది. జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వీజీ వెంకటరెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేల్చింది.