తమిళనాడు ధర్మపురిలోని వేదరంబట్టిలోని బాణాసంచా గోదాంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సజీవదహనమయ్యారు. బాణాసంచా తయారీ గోదాములో పేలుడు సంభవించడంతో మహిళా కార్మికులు తిరుమలర్, తిరుమంజు, చెన్పగం అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్కడ నిర్వాహకులు అనుమతి లేకుండానే బాణాసంచా తయారు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.