సమ్మర్ ఎఫెక్ట్ మామలుగా లేదు. భానుడు నిమ్ములు చిమ్ముతున్నాడు. ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఓ TVS XL బైక్ దగ్ధమైంది. మండలంలోని కరెంట్ ఆఫీస్ దగ్గరలోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఎండ తీవ్రతకు పార్కింగ్ చేసిన XL బైక్ కాలిపోయింది. దీంతో గమనించిన స్థానికులు మంటలార్పే ప్రయత్నం చేశారు.