లెబనాన్‌లో కొత్త తరహా అటాక్ జరిగింది. హిజ్‌బుల్లాలు వాడే పేజర్లను టార్గెట్ చేశారు. పేజర్లను హ్యాక్ చేసి పేల్చేశారు. దీంతో లెబనాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయపడ్డారు. అయితే పేజర్ పేలుళ్లకు చెందిన వీడియోలు కొన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఏదో పనిలో నిమగ్నమైన సమయంలో.. పేజర్ యూజర్లు ఒక్కసారిగా అది పేలడంతో కుప్పకూలిపోయారు. సుమారు 1200 మంది గాయపడ్డారు.