రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ACC) రాజేశ్వర్ రావు పునర్నియామకానికి ఆమోదం తెలిపింది. 2024 అక్టోబర్ 9 నుంచి ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన పదవీకాలం కొనసాగుతుందని ఏసీసీ పేర్కొంది.