ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్‌లో ఓ సెలూన్ వ్యాపారి కస్టమర్ కి ఉమ్ముతో ఫెషీయల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో యూపీ పోలీసులు సెలూన్ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే తాత్కాలిక సెలూన్‌ను జిల్లా అధికార యంత్రాంగం గురువారం కూల్చివేసింది. ఈ సెలూన్‌ను టిన్‌షీట్‌లతో తయారు చేసి ఆక్రమించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బుల్‌డోజర్‌తో సెలూన్‌ను తొలగించినట్లు పోలీసు అధికారి కపూర్ కుమార్ తెలిపారు.