తెలంగాణలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్

70చూసినవారు
రామంతపూర్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. నాంపల్లికి చెందిన మహమ్మద్ ఆఫ్తార్ కల్తీ నకిలీ అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్నాడు. అతనిని అరెస్టు చేసి అల్లం వెల్లుల్లిలో కలిపే రసాయనాలు టైటానియం పొడి 200 గ్రాములు, సిట్రిక్ ఆసిడ్ 30 కేజీలు, తయారు చేసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు 1200 కేజీలు స్వాదీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్