నకిలీ విత్తనాలను ఇలా గుర్తించొచ్చు

66చూసినవారు
నకిలీ విత్తనాలను ఇలా గుర్తించొచ్చు
పరిశోధనస్థానాలు, ప్రభుత్వ అనుమతిగల దుకాణాల్లోనే విత్తనాలు కొని బిల్లులను తీసుకోవాలి. విత్తనాల సంచిపైగల తయారీ స్థలం, కంపెనీ, ఫోన్‌నంబరు, లాట్, బ్యాచ్‌నంబరు, గడువు, జన్యుస్వచ్ఛత, మొలకశాతం, ధర తదితర పూర్తి వివరాలను పరిశీలించాలి. విత్తనాలను బస్తాపైగానీ, ప్యాకెట్లపైగానీ విత్తన వివరాలు లేబుల్‌ రూపంలో లేకపోతే నకిలీవని గుర్తించాలి. నకిలీ విత్తనాల ప్యాకెట్లపై లాట్‌ నంబరు ఉండదు. నకిలీ విత్తనాలని అనుమానం వస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి.

సంబంధిత పోస్ట్