ఏపీలో రెవెన్యూ సదస్సుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు సదస్సులు నిర్వహించనున్నారు. 22ఏ, ఫ్రీహోల్డ్, భూ ఆక్రమణలపై ఫిర్యాదు స్వీకరించనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.