వైసీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆళ్ల నాని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. గతంలో టీడీపీ నేతలను వేధింపులకు గురి చేశారని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చేరికను టీడీపీ పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా టీడీపీ నేతలతో చర్చించిన తర్వాత ఆయన చేరికపై ఓ నిర్ణయం తీసుకోనున్నారట.