నేడే రైతు రుణమాఫీ నగదు విడుదల

57చూసినవారు
నేడే రైతు రుణమాఫీ నగదు విడుదల
తెలంగాణ రైతు రుణ మాఫీకి ముహూర్తం సమీపించింది. గురువారం సాయంత్రానికి లక్ష రూపాయల్లోపు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ నిధులను విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి.

సంబంధిత పోస్ట్