తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్యాణి డ్యామ్ దగ్గర తిరుపతి-పీలేరు, మదనపల్లి-తిరుపతి వెళ్లే బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మదనపల్లి బస్సు డ్రైవర్ క్యాబిన్ లోకి ఇరుక్కుపోగా దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.