మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. జల్నా జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయ దర్శనానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వెళుతున్న కారు.. వెనుకనుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.