ఘోర రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

84చూసినవారు
ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఫరక్కా-లాల్మటియా ఎంజీఆర్ రైల్వే లైన్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు లోకో పైలట్లతో సహా ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు రైల్వే వర్కర్లు, సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్