ఏపీలో 51 మండలాల్లో కరవు ప్రభావం

53చూసినవారు
ఏపీలో 51 మండలాల్లో కరవు ప్రభావం
రెండు తెలుగురాష్ట్రాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో రబీలో వరి సాగుచేసిన రైతులు సరిపడ నీళ్లు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రబీ పంట కాలంలో 6 జిల్లాల పరిధిలోని 51 కరవు మండలాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మధ్యస్థంగా కరవు ప్రభావం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్