పశ్చిమ బెంగాల్‌లోని పరగణాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ గాయపడగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఇంట్లో నిల్వ ఉంచిన ఫైర్ క్రాకర్స్‌కు మంటలు అంటుకుని సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.