AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కీసర టోల్‌గేట్‌కు ముందే ఆయన బైక్ అదుపుతప్పి కింద పడినట్లు కనిపిస్తోంది. గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్దకు చేరుకునే సమయానికి అతని బైక్ హెడ్‌లైట్ కిందికి వేలాడుతూ ఉంది. విజయవాడకు రాకముందే ఆయన బైక్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రామవరప్పాడు రింగురోడ్డు సమీపంలో విశ్రాంతి తీసుకుని ప్రవీణ్ రాజమండ్రి బయలుదేరినట్లు తెలుస్తోంది.