AP: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తున్నారు. ఇవాళ ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం పింఛన్ పంపిణీ చేశారు. 34 లక్షల మందికిపైగా పింఛన్ తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, మంగళవారం ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలోని కొత్తగొల్లపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తారు.