చెట్టును ఢీ కొన్న కారు.. తండ్రి, కొడుకు మృతి

72చూసినవారు
చెట్టును ఢీ కొన్న కారు.. తండ్రి, కొడుకు మృతి
TG: కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నిర్మల్ జిల్లా, నర్సాపూర్‌(బి) మండలం చాక్పెల్లి వద్ద చోటు చేసుకుంది. సురేష్(27) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి బోథ్‌ మండలం కుచ్లాపూర్‌ నుంచి లోకేశ్వరం మండలం మన్మద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సురేష్, అతడి కుమారుడు దీక్షిత్‌(7) అక్కడికక్కడే మృతి చెందాడు. సురేష్‌ భార్య, కూతురికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్