అవాలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆవాలతో శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. అవాలను మరిగించిన నీటిని తాగడం లేదా పుక్కిలించడం వంటివి చేస్తే పంటి నొప్పి త్వరగా తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.