ఏపీలో మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సముద్ర వేట నిషేధ భృతి కింద ఏప్రిల్‌లో రూ.20 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే.. తాము రూ.20 వేలు ఇస్తున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెగా DSC ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.