తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అందులో పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓ యువతి తలపై స్వయంగా తండ్రే సీసీ కెమెరాను అమర్చాడట. తద్వారా ఆమెను నిరంతరం పర్యవేక్షించే వీలుంటుందని అతని భావన. తన తండ్రి ఏం చేసినా తన మంచికోసమేనని ఆమె సమర్థించుకున్నది. కరాచీలో ఇటీవల సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించింది.