పోర్న్ వీడియోలు చూస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి

1084చూసినవారు
పోర్న్ వీడియోలు చూస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తున్నాడన్న కారణంతో ఓ తండ్రి తన 14 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి సమీపంలోని మురికి కాల్వలో పడేశాడు. ఈ విషయం అతని భార్యకు తెలియదు. కొడుకు కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భయపడిన తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్