అరటిలో ఎరువుల యాజమాన్యం

52చూసినవారు
అరటిలో ఎరువుల యాజమాన్యం
అన్ని అరటి రకాలకు ఒక్కొక్క చెట్టుకు 50 గ్రా. భాస్వరాన్నిచ్చే ఎరువును వేయాలి. భాస్వరం ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. భాస్వరపు ఎరువును, సూపర్‌ఫాస్ఫేట్‌ రూపంలో పిలక నాటేటపుడు గుంట తవ్విన మట్టికి కలపటం మంచిది. బాగా చివికిన పశువుల ఎరువును సూపర్‌ ఫాస్ఫేటుతో పాటు ఒక్కొక్క గుంటకు 5.0 కిలోల వంతున కలపాలి. సారవంతమైన సాధారణ నేలలో అరటిచెట్టు ఒక్కటికి 200 గ్రా. నత్రజని, 200 గ్రా. పొటాష్‌ యిచ్చే ఎరువులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్