విమానంలో లగేజీ స్థలం కోసం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన గౌహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణీకులు ఇతర ప్రయాణికుల ముందు ఒకరిపై ఒకరు అరుస్తూ తిట్టుకున్నారు. తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో చాలా సేపటి తరువాత వివాదం సద్దుమణిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.