ఆస్కార్ వేడుక రద్దుపై స్పందించిన ఫిల్మ్ అకాడమీ

76చూసినవారు
ఆస్కార్ వేడుక రద్దుపై స్పందించిన ఫిల్మ్ అకాడమీ
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను కార్చిచ్చు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్కార్ వేడుక రద్దు అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అకాడమీ సభ్యులు స్పందిస్తూ… ఆస్కార్ వేడుకల్లో మార్పు ఉండదని, రద్దు చేసే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. 96 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఈవెంట్‌ను రద్దు చేయాలేదని వెల్లడించారు. కరోనా టైంలో కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్