హిజ్బొల్లా కమాండర్ నబిల్‌ కౌక్‌ హతం

84చూసినవారు
హిజ్బొల్లా కమాండర్ నబిల్‌ కౌక్‌ హతం
హిజ్బొల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్‌ దళాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో హిజ్బొల్లా కమాండర్ నబిల్‌ కౌక్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం ప్రకటించింది. నబిల్ కౌక్‌ మరణాన్ని హిజ్బొల్లా ధ్రువీకరించనప్పటికీ.. మద్దతుదారులు సోషల్‌ మీడియా వేదికగా సంతాప సందేశాలను పోస్ట్‌ చేస్తున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్‌ జరిపిన భారీ దాడిలో నస్రల్లా ప్రాణాలు కోల్పోయిన మరునాడే నబిల్‌ కౌక్‌ను సైన్యం హతమార్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్