ఎలక్ట్రిక్ ఆటోలో చెలరేగిన మంటలు (వీడియో)

1067చూసినవారు
కర్ణాటకలోని ‘కలబురిగి’లో ఓ ఎలక్ట్రిక్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు, డ్రైవర్ గమనించి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఆటోలోని బ్యాటరీలో మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్